26, నవంబర్ 2009, గురువారం

మూడువందల యాభైమూడవ సభ

తెలుగు వెలుగు

అధ్యక్షులు : శ్రీ ఎం. సుధాకర్
(ప్రొ|| శ్రీకృష్ణా బజాజ్, విజయనగరం)
వక్త : డా|| జి. వి. పూర్ణచందు
(తెలుగు భాషోద్యమ ప్రముఖులు, ప్రధాన కార్యదర్శి, కృష్ణాజిల్లా రచయితల సంఘం, విజయవాడ)
విషయం : తెలుగుభాషా ప్రాచీనత - నూతన పరిశోధనాంశాలు
సమ్మానకర్త : కుమారి అడిదం ఇందిరాంబ
(సహాయ కార్యదర్శి, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 29-11-2009 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు

2 కామెంట్‌లు:

  1. గురజాడ స్మారక జిల్లా గ్రంథాలయంలో జరుపుకొంటున్న ఈ సభలో గురజాడకు సంబంధించి నవంబర్ 30 యొక్క ప్రాశస్త్యాన్ని కూడా ప్రస్తావించుకొంటే సముచితంగా ఉంటుందని నా అభిప్రయం.
    మీ కార్యక్రమం విజయప్రదం కావాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. రామకృష్ణగారు,
    మీరు ఆశించిన విధంగానే ఆరోజు గురజాడను స్మరించుకోవడం జరిగింది. అంతేకాక, ప్రతీ ఏడాదీ నవంబరు ముప్ఫైన విజయనగరంలో అనేక సంస్థలు కలసి (విజయభావనతో సహా) గురజాడ సాంస్కృతిక సమాఖ్య పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
    ఈ సారి కార్యక్రమాలలో ఉదయం ఊరేగింపు (వారు వాడిన వస్తువులను, పటాన్ని పట్టుకుని) దేశభక్తిగీతాలాపాలు, గురజాడ విగ్రహానికి పూలమాలాలంకరణ, ప్రసంగాలు, విద్యార్థులకు వకృత్వ, వ్యాసరచన పోటీలు, శ్రీ రావి కొండలరావుగారికి గురజాడ విశిష్ట పురస్కార ప్రదానం ఉన్నాయి. అనంతరం ఆయన దర్శకత్వంలో వచ్చిన 'కన్యాశుల్కం' టెలీ సీరియల్ లోని కొన్ని ముఖ్యఘట్టాల ప్రదర్శన కూడా జరుగుతోంది.

    రిప్లయితొలగించండి