16, డిసెంబర్ 2009, బుధవారం

శతావధాన సాహితీ క్రతువు

తేదీలు : 25,26,27 డిశెంబరు, 2009
సమయం : ప్రతి రోజూ ఉదయం 9 గం|| ల నుండి 1 గం|| వరకు
సాయంత్రం 4 గం|| ల నుండి 8 గం ||ల వరకు

వేదిక : ఆనందగజపతి కళాక్షేత్రం - విజయనగరం

అవధాని : సహస్ర భారతి, మహా సహస్రావధాని, ధారణా బ్రహ్మరాక్షసుడు
డా|| గరికిపాటి నరసింహారావు

సంచాలకులు : శ్రీ పేరి రవికుమార్

అప్రస్తుత ప్రసంగం : శ్రీ రాంభట్ల నృసింహశర్మ (ఆకాశవాణి, విశాఖ)
శ్రీ ధవళ సర్వేశ్వరరావు
డా|| జక్కు రామకృష్ణ
డా|| భైరవభట్ల విజయాదిత్య
పృచ్చకులు :

సమస్య : అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ, శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు, శ్రీ కె. మార్కండేయులు, శ్రీ క్రొవ్విడి శారదా ప్రసాద్, శ్రీ కె. పి. ఎస్. పంతులు, డా|| తాతా వెంకటలక్ష్మి, శ్రీ పంతుల దక్షిణామూర్తి ప్రసాద్, శ్రీ తూట బాబాజీ, శ్రీ ఎస్. శ్రీకాంత్, శ్రీ ఎమ్. వి. కృష్ణమూర్తి, శ్రీ కొణిశ హరి, డా|| టి. జి. కృష్టారావు, శ్రీ కె. బాబూరావు, శ్రీ పి. వి. రాధాకృష్ణ, డా|| పి. టి. జి. రంగాచార్యులు, అవధాని కె. చంద్రశేఖర్, శ్రీ బి. హెచ్. శివరామ్, శ్రీ ఎ. రాధాప్రసాద్, శ్రీ నేతేటి గణేశ్వరరావు, శ్రీ ఆర్. సత్యం, శ్రీ కె. పూజ్యనాథాచారి, శ్రీ జి. సన్యాసినాయుడు, శ్రీ సర్వాజోస్యుల గౌరీశంకరశాస్త్రి, శ్రీ వి. రమణ, శ్రీ టి. సత్యనారాయణ

దత్తపది : శ్రీమతి బి. హెచ్. దేవీప్రకాష్, శ్రీ నల్ల బాలకృష్ణ, శ్రీ కిలపర్తి దాలినాయుడు, శ్రీ గుమ్మా రంగారావు, శ్రీ పి. వెంకటకృష్ణయ్య, కుమారి ఎల్. సీతామహాలక్ష్మి, కుమారి పి. స్వాతి, శ్రీ ఆర్. పవన్‍కుమార్, శ్రీమతి బి. విజయభారతి, శ్రీ పి. రాజేశ్వరరావు, శ్రీ టి. రమణ, డా|| ఆర్. శశికళ, డా|| సి. సూర్యనారాయణ, శ్రీ బెహరా గణేశ్, కుమారి అడిదం శారద, శ్రీ అయ్యగారి శ్రీనివాసరావు, శ్రీ కె. వి. జగన్నాథరావు, శ్రీ బి. రామజోగారావు, శ్రీ చౌదరి చిట్టన్న, శ్రీ ఎమ్. పార్వతీశం, కుమారి బి. తారకేశ్వరి, కుమారి కె. ఎన్. ఎస్. హైమవతి, శ్రీ బి. కోటారావు, కుమారి కె. సంతోషిలక్ష్మి, శ్రీ వి. శ్రీను.

వర్ణన : శ్రీమతి గుమ్మా చంపావతి, శ్రీమతి పి. హేమకామేశ్వరి, శ్రీ దేవరకొండ రామనరసింగరావు, శ్రీ బి. హెచ్. కె. బాబూజి, శ్రీ జి. ఆర్. రాఘవరాజు, శ్రీ ఎ. సదాశివరాజు, శ్రీ ఆర్. నాగార్జునరావు, శ్రీ పి. లక్ష్మణరావు, శ్రీ ఎస్. సోమేశ్వరరావు, శ్రీమతి ఎ. లలితాశంకర్, శ్రీ చిట్టెళ్ళ వెంకట సుబ్రహ్మణ్యశర్మ, శ్రీ జి. గోవిందరాజు, శ్రీ వి. నీలకంఠాచారి, శ్రీమతి బి. రుక్మిణి, శ్రీమతి సి. హెచ్. ఎస్. ఎల్. నరసమ్మ, శ్రీమతి ఆర్. లక్ష్మి, కుమారి పి. కారుణ్యకవిత, కుమారి వై. భార్గవి, శ్రీ జి. రమణమూర్తి, శ్రీ దివ్వెల చిన్నారావు, శ్రీమతి పేరి సావిత్రి, శ్రీ రేవళ్ల ఆదినారాయణ, శ్రీమతి సి. హెచ్. శ్రీలక్ష్మి, శ్రీమతి భావవరపు సత్యవతి, శ్రీ గన్నవరపు దుర్గాప్రసాద్.

ఆశువు : 25 గురు ఎంపిక చేసిన సహృదయ ప్రేక్షకులే పృచ్ఛకులు

2 కామెంట్‌లు:

  1. సీ:-
    శ్రీ కరం బైనట్టి చిన్మూర్తి, యీనాటి - కవి కులంబున మేటి గరికిపాటి.
    సుజ్ఞాన సంపన్న సుందరంబుల సాటి - కనరాని ఘన మేటి గరికిపాటి.
    అవధాన ప్రక్రియ నరయ లేరిల పోటి. - కమల సంభవు సాటి గరికిపాటి.
    ఆంధ్ర మాతకు సేవ లందించు, యీనాటి - కల్యాణ గుణ వాటి గరికిపాటి.
    తే:-
    నవ్య రుచిరార్థ కవితల నరుడనంగ.
    సిం హ గాంభీర్య వాగ్ ధాటి సిమ్హమనగ
    నార సిమ్హుగ వెలుగొందె గారవముగ.
    గరికి పాటిని గను టీనగరికి పాటి.

    ఆర్యులారా! ఈ పద్యాన్ని నేను గురజాడ పుట్టిన యస్.రాయవరం గ్రామంలో
    30-11-2007. న వారితో పాటు గురజాడ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మహాసభలో గరికిపాటిని గూర్చి ఆశువుగా చెప్పాను.వారు చాలా సంతోషించారు.
    అట్టి మహా పుంభావ సరస్వతీ మూర్తిచేత శతావధానం చేయించడానికి సంసిద్ధంగానున్న మీకూ, మీ సంస్థకూ నా హృదయ పూర్వక అభినందనలు.
    నా పేరు:- చింతా రామ కృష్ణా రావు,
    విజయనగరంలోనే సంస్కృత కలాశాలలో చదువుకొన్న భాగ్యశాలిని.
    శ్రీ గోపాలరావు గురువరుల శిష్య కోటిలో నే నొకడిని.
    చోడవరం ప్రభుత్వ డిగ్రీ కలాశాలలో ఉపన్యాసకునిగా పని చేసి, విశ్రాంతి తీసుకొని, ప్రస్తుతం భాగ్య నగరంలో ఉంటున్నాను.

    http//andhraamrutham.blogspot.com
    చిఱునామాలో
    " ఆంధ్రామృతం " అనే బ్లాగ్ నిర్వహిస్తున్నాను.

    మీ కార్య క్రమాలను మీ బ్లాగ్ ద్వరా తెలుసుకొని, చాలా ఆనందిస్తుంటాను.
    సాహితీ సౌధాన్ని ఆకాశపుటంచుల వరకు గొనిపోవాలనే మీ ప్రయత్నానికి ఆ సరస్వతీ మాత మహా కవుల రూపంలోను, పండితుల రూపంలోను, కళాకారుల రూపంలోను, సాహితీ పిపాసాపరుల రూపంలోను, నిత్యం తోడుగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.
    నా email ID:-
    chinta.vijaya123@gmail.com
    నా సెల్ నెంబరు:-
    9247238537.
    నా ఆనందాన్ని మీతో ఈ విధంగా పంచుకొనేలా చేసిన మీకు నా కృతజ్ఞతలు.
    నమస్తే.

    రిప్లయితొలగించండి
  2. మీ శతావధాన సాహితీ క్రతువు జయప్రదము కావాలని మనసారా కోరుకుంటున్నాను.
    నా e.mail address: pantulajogarao@gmail.com
    నా బ్లాగ్ పేరు కథా మంజరి.
    లింక్ pantulajogarao.blogspot.com

    ఫోన్ 9490139622
    చిరునామా pantula jogarao,
    H.No. 15.
    Opp. Sadhana Mandir Bus stop, Risala Bazar,
    Secunderabad 10
    విజయ భావన పెద్దలందరికీ నా నమోవాకాలు.

    రిప్లయితొలగించండి